470 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వన్ మెమోరియల్‌ నిర్మాణం

470 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వన్ మెమోరియల్‌ నిర్మాణం

గుజారాత్ లో వరుసగా రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోడీ .. కచ్ జిల్లాలోని భుజ్‌లో స్మృతి వన్ మెమోరియల్‌ను ప్రారంభించారు. 2001లో సంభవించిన భూకంపం బాధితుల జ్ఞాపకార్థం'స్మృతి వాన్' మెమోరియల్ నిర్మించబడింది.దాదాపు 470 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మారకాన్ని నిర్మించారు. స్మృతి వాన్ ప్రాణాలు కోల్పోయిన కచ్ ప్రజల అద్భుతమైన పోరాట స్ఫూర్తికి నివాళి అని ప్రధాని మోడీ  అన్నారు.

భుజ్ కేంద్రంగా 2001లో సంభవించిన భూకంపం లో 13,000 మంది మరణించారు. 1,67,000 మంది గాయాలపాలయ్యారు. సుమారు 400,000 గృహాలు ధ్వంసమయ్యాయి. ఈ స్మారక చిహ్నంలో భూకంపం సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల పేర్లను కలిగి ఉంది. ఈ మ్యూజియంలో గుజరాత్ స్థలాకృతి, 2001 భూకంపం తర్వాత పునర్నిర్మాణ కార్యక్రమాలు, విజయగాథలను వివరిస్తూ చిత్రలను ఏర్పాటు చేశారు.  ఇది 5D సిమ్యులేటర్ సహాయంతో భూకంపం యొక్క అనుభవాన్ని పునరుద్ధరించడానికి ఒక బ్లాక్, భూకంప సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు మరొక బ్లాక్‌ని ఏర్పాటు చేశారు.