స్పేస్‌ సంస్థలకు గొడుగులా ఇస్పా!

స్పేస్‌ సంస్థలకు గొడుగులా ఇస్పా!

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్పేస్ సెక్టార్లోని వివిధ సంస్థలు, కంపెనీలతో  కూడిన ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఇస్పా) ను ప్రధాని నరేంద్రమోడీ సోమవారం లాంచ్ చేశారు. ఈ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌లో ఇస్రో, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌, వన్‌‌‌‌‌‌‌‌వెబ్‌‌‌‌‌‌‌‌, టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన నెల్కో, ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ, మ్యాప్‌‌‌‌‌‌‌‌మైఇండియా వంటి కంపెనీలు, సంస్థలు, కొన్ని స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు కూడా మెంబర్లుగా ఉన్నాయి. స్పేస్  సెక్టార్ విస్తరిస్తుండడం, శాటిలైట్ ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌పై అభివృద్ధి చెందిన దేశాలు ఫోకస్ పెట్టడంతో ఇండియా కూడా ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకుంటోంది. స్పేస్ సంస్కరణలకు కట్టుబడి ఉన్నామనే విషయం ఇస్పా లాంచ్ ద్వారా తెలుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. స్పేస్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రైవేట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల కోసం ఓపెన్ చేయడం, ఇస్రోను మరింత సమర్ధవంతంగా వాడుకోవడంపై ఫోకస్ పెట్టామని చెప్పారు. అంతేకాకుండా స్పేస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి పాలసీలను తయారు చేస్తున్నామని, అవి చివరి దశలో ఉన్నాయని అన్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ నెక్స్ట్‌‌‌‌‌‌‌‌లో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తున్న జయంత్ పాటిల్‌‌‌‌‌‌‌‌  ఇస్పాకు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇస్పా వర్చువల్‌ లాంచ్‌‌‌‌‌‌‌‌కుస్పేస్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌ అండ్ ఐటీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌, ఇస్రో చైర్మన్‌‌‌‌‌‌‌‌ కే శివన్, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏ అజిత్ దోవల్‌‌‌‌‌‌‌‌, సీడీఎస్‌‌‌‌‌‌‌‌ జనరల్ బిపిన్ రావత్‌‌‌‌‌‌‌‌,  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ సునిల్ మిట్టల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. 

ప్రైవేట్ కంపెనీల కోసం సింగిల్ విండో

నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని స్పేస్ సంస్కరణలు తీసుకొస్తున్నామని మోడీ తెలిపారు. ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్ కంపెనీలకు ఫ్రీడమ్ ఇవ్వడం, ప్రభుత్వం ఈ సేవలను అందించే ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌గా ఉండడం, భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను రెడీగా మార్చడం, కామన్‌‌‌‌‌‌‌‌ మ్యాన్‌‌‌‌‌‌‌‌కు మేలు చేసేందుకు   స్పేస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒక రిసోర్స్‌‌‌‌‌‌‌‌గా వాడడం..ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని పాలసీలను తీసుకొస్తున్నామని చెప్పారు.  స్పేస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించేందుకు ‘ఇన్‌‌‌‌‌‌‌‌–స్పేస్‌‌‌‌‌‌‌‌ఈ’ ని కూడా మోడీ లాంచ్ చేశారు. ఈ ఏజెన్సీ సింగిల్ విండోలా పనిచేస్తుందని, స్పేస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లను చూడడం, ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రాజెక్టులను వేగవంతం చేయడం వంటి విషయాలను పరిశీలిస్తుందని అన్నారు.   

సరియైన టైమ్‌లో..

స్పేస్ రేస్ స్టార్టయ్యిందని, రోజు రోజుకీ పెరుగుతోందని భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ సునిల్ మిట్టల్‌‌‌‌‌‌‌‌ ఇస్పా లాంచ్‌‌‌‌‌‌‌‌లో అన్నారు. దేశం నుంచే ఇస్రో ద్వారా  తమ వన్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌ కోసం శాటిలైట్లను లాంచ్ చేస్తున్నామని చెప్పారు. ‘పెద్ద దేశాలు ప్రైవేట్ కంపెనీలతో కలిసి స్పేస్‌‌‌‌‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేగంగా విస్తరిస్తున్నాయి.  ప్రభుత్వాల సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యం కాదు’ అని మిట్టల్ అన్నారు. ఇండియా స్పేస్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నెక్స్ట్ లెవెల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లడంలో ప్రధాని మోడీ సరియైన టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్ అయ్యారని అభిప్రాయపడ్డారు. ‘ఇస్రో లాంటి సంస్థలు మనదగ్గర ఉండడం మన అదృష్టం. దీంతో పాటు న్యూస్పేస్‌‌‌‌‌‌‌‌ ఇండియా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌‌‌‌‌) కూడా సొంత శాటిలైట్లను తయారు చేయడంలో కీలకంగా పనిచేస్తోంది. పాత టెక్నాలజీలను కొత్త టెక్నాలజీలు భర్తీ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీల కోసం బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు’ అని మిట్టల్ చెప్పారు.

ఇస్పా ఎందుకంత ముఖ్యం..

స్పేస్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే  ఎదుగుతోంది. శాటిలైట్ ఇంటర్నెట్‌‌‌‌, శాటిలైట్‌‌ కమ్యూనికేషన్లపై వివిధ దేశాలు, కంపెనీలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఇండియా కూడా స్పేస్‌ ఇండస్ట్రీలో విస్తరించేందుకు వివిధ చర్యలు తీసుకుంటోంది. 

శాటిలైట్‌ కమ్యూనికేషన్  పెరుగుతోంది..

ఎయిర్‌‌‌‌టెల్‌‌ వన్‌‌వెబ్‌‌, ఎలన్‌‌మస్క్‌‌ స్టార్‌‌‌‌లింక్‌‌, అమెజాన్‌‌ కైపెర్, యూఎస్‌‌ కంపెనీ హ్యూజ్స్‌‌ కమ్యూనికేషన్స్‌‌ వంటి కంపెనీలు శాటిలైట్‌  కమ్యూనికేషన్‌‌పై పనిచేస్తున్నాయి. వన్‌‌వెబ్‌‌ 648 శాటిలైట్లను స్పేస్‌‌లోకి పంపాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇప్పటికే 322 శాటిలైట్లను పంపింది. ఇండియాలో స్పేస్‌‌ కమ్యూనికేషన్‌‌ సేవలను 2022 నాటికి తీసుకొస్తామని చెబుతోంది. దేశంలో  శాటిలైట్ ఇంటర్నెట్‌‌ సేవలను అందించేందుకు అనుమతివ్వాలని స్టార్‌‌‌‌లింక్, కైపర్‌‌‌‌లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాగా, ప్రస్తుతం టవర్ల ద్వారా టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ అందుతున్నాయి. అదే  శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంటే మారుమూల ప్రాంతాలు, ఎడారులు, సముద్రాల్లో కూడా కమ్యూనికేష్‌‌కు అంతరాయం ఉండదు. ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు శాటిలైట్ కమ్యూనికేషన్స్‌‌ అందుబాటులో  రాలేదు.