
డెహ్రాడున్: ఈ నెల 21న కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందర్శిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. రెండు దేవాలయాలలో ఆయన పూజలు చేసి.. అక్కడ జరుగుతున్న పునర్నిర్మాణ పనులను సమీక్షిస్తారని వివరించాయి. ముందుగా కేదార్‌నాథ్‌ను సందర్శించి ప్రధాని అక్కడ పూజలు నిర్వహిస్తారు.
తర్వాత బద్రీనాథ్ ఆలయానికి వెళ్లి పూజలు చేసి, బద్రీనాథ్ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ప్రాజెక్టులను మోడీ రివ్యూ చేస్తారు. అంతేగాక, సరిహద్దు గ్రామం మానాకు వెళ్లి స్థానికులను, అక్కడ విధులు నిర్వహిస్తున్న జవాన్లను కలవనున్నారు. మోడీ కేదార్‌నాథ్ పర్యటన కోసం వారం రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.