రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసి దీపావళి విషెస్ చెప్పిన మోడీ

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసి దీపావళి విషెస్ చెప్పిన మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్ , మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడులను స్వయంగా వెళ్లి కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి వేళ కార్గిల్ లో సైనికులతో కలిసి పండుగ సంబురాలు చేసుకున్న ప్రధాని మోడీ.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్న వెంటనే  రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉప రాష్ట్రపతిలను కలిశారు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. దేశ ప్రజలు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

అంతకుముందు కార్గిల్ లో సైనికులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘ప్రపంచ శాంతికి మేం అనుకూలం. మా ప్రభుత్వం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు. దాన్ని చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగిస్తుంది. లంకలో జరిగినా, కురుక్షేత్రంలో జరిగినా చివరి వరకు యుద్ధాన్ని నిరోధించడానికే ప్రయత్నిస్తాం’’ అని స్పష్టం చేశారు.