
న్యూఢిల్లీ: తన పుట్టిన రోజున గిఫ్ట్‌గా వచ్చిన కదంబ్ మొక్కను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నాటారు. ఇంగ్లండ్ రాజు చార్లెస్–3 నుంచి బహుమతిగా వచ్చిన ఈ మొక్కను మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాస ప్రాంగణంలో నాటి నీళ్లు పోశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
రెండు దేశాల మధ్య స్నేహం, పర్యావరణ రక్షణ పట్ల ఉమ్మడి నిబద్ధతకు ఈ మొక్క నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 17న బుధవారం తన 75వ పుట్టిన రోజు సందర్భంగా కింగ్ చార్లెస్.. కదంబ్ మొక్కను గిఫ్ట్‌గా పంపారని, దానిని ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాటినట్లు ప్రధాని తెలిపారు.