వ్యవసాయం, పాడి పరిశ్రమపై ట్రంప్ కన్ను.. రైతుల ప్రయోజనాలపై రాజీపడం:అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ

వ్యవసాయం, పాడి పరిశ్రమపై ట్రంప్ కన్ను.. రైతుల ప్రయోజనాలపై రాజీపడం:అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ

అమెరికా విధించిన సుంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలకు భారత్ ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీపడదని ఆయన స్పష్టం చేశారు. మా రైతుల ప్రయోజనాలే మా ప్రధాన ప్రాధాన్యత...రైతులు, మత్స్యకారులు ,పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎప్పుడూ రాజీపడదని స్పష్టం చేశారు. 

రైతు ప్రయోజనాలు జాతీయ ప్రాధాన్యత.. రైతులు, పాడి రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలపై భారత్ ఎప్పుడూ రాజీపడదు.. దీంతో  వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది..అయిన రైతుల కోసం సిద్దంగా ఉన్నాం అని ప్రధాని అన్నారు. రిపోర్టుల ప్రకారం..భారత వ్యవసాయ,పాడి మార్కెట్‌లోకి విస్తృత ప్రవేశం కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..ఇది మిలియన్ల మంది రైతుల జీవనోపాధిని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం మవుతోంది. 

భారత్ పై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ఆగస్టు1న విధించిన 25 శాతం సుంకానికి అదనంగా.. రష్యా చమురు కొనుగోలు చేసినందుకు భారత్ పై అమెరికా మరో 25 శాతం అదనపు సుంకాన్ని విధిస్తూ ట్రంప్ బుధవారం రాత్రి ప్రకటించారు. 

భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ ఫెడరేషన్ చమురును దిగుమతి చేసుకుంటోందని గుర్తించారు. అని వైట్ హౌస్ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఆర్డర్ ట్రంప్ చెప్పారు. ఆర్డర్ ప్రకారం.. అదనంగా ఆగస్టు 27నుంచి మరో 25 శాతం సుంకం అమలులోకి రానుంది. 

రెండువైపులా వాణిజ్య ఒప్పంద చర్యలు జరుగుతున్నప్పటీకీ భారత్ పై అమెరికా సుంకాలు విధించింది. గత నెల వాషింగ్టన్ లో ఐదవ రౌండ చర్చలు జరిగాయి. మరోసారి ఆగస్టు 25న న్యూఢిల్లీలో అమెరికా ప్రతినిధిబృందం సమావేశం కానుంది.