ఈ శ్రీరామ నవమి ఒక తరానికి మైలురాయి: మోదీ

ఈ శ్రీరామ నవమి ఒక తరానికి మైలురాయి: మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ  శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో  ప్రాణ ప్రతిష్ఠ తర్వాత  జరుగుతున్న మొదటి రామనవమి. ఇది  ఒక తరానికి  మైలురాయి వంటిది . ఐదు దశాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది.  కోట్లాది మంది  ఎన్నో సంవత్సరాల తపస్సు త్యాగాల ఫలితం.  శ్రీరాముని కృపవల్లే  అయోధ్యలో ప్రాణప్రతిష్ట చూడగలిగానని అన్నారు. శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు మోదీ.

  

మరో వైపు శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్యకు భక్తులు పోటెత్తారు. ఉదయం 3.30 గంటలకు బాలరాముడికి మంగళహారతితో అర్చకులుపూజలు ప్రారంభించారు.. అయోధ్య వీధులన్నీ భక్తులతో నిండిపోయి..రామనామ స్మరణతో హోరెత్తాయి. మరో వైపు  బాలరాముడిని భక్తులు దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రద్దీ నేపథ్యంలో ప్రత్యేక పాస్ లను రద్దు చేశారు.