దేశంలోని ప్రధాన ఫార్మా హబ్ లలో హిమాచల్ ఒకటి

దేశంలోని ప్రధాన ఫార్మా హబ్ లలో హిమాచల్ ఒకటి

హిమాచల్ ప్రదేశ్ క్లీన్ గా ఉండేందుకు...ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు టూరిస్టులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్లాస్టిక్ కారణంగా హిమాలయాలకు జరుగుతున్న నష్టంపై తాము అప్రమత్తంగా ఉన్నామన్నారు. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే... ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలోని ప్రధాన ఫార్మా హబ్ లలో హిమాచల్ ఒకటని... కరోనా సంక్షోభ సమయంలో హిమాచల్ ప్రదేశ్.. దేశానికే కాకుండా ప్రపంచానికి హెల్ప్ చేసిందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో జైరాం ఠాకూర్ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... నిర్వహించిన కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. 11వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మోడీ.