భారత రక్షణ రేఖ ఇప్పుడెంతో సురక్షితం.: ఆదంపూర్ ఎయిర్ బేస్లో ప్రధాని మోదీ

భారత రక్షణ రేఖ ఇప్పుడెంతో సురక్షితం.: ఆదంపూర్ ఎయిర్ బేస్లో ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ మామూలు సైనిక చర్య కాదని ప్రధాని మోదీ అన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనమేనని, ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు అది అర్థమైందని అన్నారు. భారత రక్షణ రేఖ ఇప్పుడెంతో సురక్షితంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.  పంజాబ్ లోని ఆదంపూర్ సైనిక స్థావరాన్ని దర్శించిన ప్రధాని మోదీ సైనికులను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు. త్రివిధ దళాల సిబ్బందికి దేశం తరఫున నా సెల్యూట్ అని ఈ సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్ జయజయ ధ్వానాలు దేశమంతా వినిపిస్తున్నాయని అన్నారు. భారత్ మాతాకీ జై నినాదాలతో శత్రు దేశం కంపించిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు:

  • మన రక్షణ వ్యవస్థ ముందు పాక్  విఫలమయ్యింది
  • ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపాం
  • తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం.. 
  • ఉగ్రవాదుల అడ్డాలను తునాతునకుల చేశాం
  • టెర్రరిస్టుల ఇళ్లల్లోకి నేరుగా చొచ్చుకెళ్లాం
  • కానీ వాళ్లు పిరికి పందలుగా దాక్కుని వచ్చారు
  • వందకు పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టాం
  • మన మిస్సైల్స్ తో పాకిస్తాన్ కు నిద్ర కరువైంది
  • మనం దెబ్బ కొడితే ఉగ్రవాదులకు నిద్ర రావద్దు
  • భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగేది వినాశనమే
  • మన సామర్థ్యం చూసి పాక్ కు కొన్ని రోజులు నిద్ర పట్టదు
  • ఆపరేషన్ సిందూర్ తో దేశ గౌరవాన్ని కాపాడారు.
  • మన ఎయిర్ బేస్ పై దాడి చేసేందకుపాక్ ప్రయత్నించింది
  • పౌర విమానాలను అడ్డు పెట్టుకుని పాక్ కుయుక్తులు చేస్తోంది
  • ఆపరేషన్ సిందూర్ తో సిందూర్ తుడిచినవాళ్ల సంగతేంటో చూశాం
  • పిన్ పాయింట్ గా టెర్రరిస్టుల అడ్డాలను ధ్వంసం చేశాం
  • ఆపరేషన్ సిందూర్ లో జవాన్ల తెగువను అభినందిస్తున్నాను
  • వీరుల దర్శనం దొరికితే జన్మధన్యం అయినట్లే
  • వీరుల దర్శనం కోసమే మీ దగ్గరికి వచ్చా
  • దేశమంతా మీతోనే ఉంది
  • భవిష్యత్తులో అందరూ మీగురించి మాట్లాడుకుంటారు
  • ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాం
  • న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు మేము భయపడం
  • నిజాయితీ, విధానం, సామర్థ్యం.. ఇదే మన త్రివేణి సూత్రం