బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక బహుమతులు ఇవే

 బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక బహుమతులు ఇవే

అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. శ్వేతసౌధంలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ  అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ లకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అటు జో బైడెన్ దంపతులు కూడా ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్టులు అందించారు. 

ప్రత్యేక వంటకాలు..

వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రత్యేక  విందు ఇచ్చారు. ఈ  విందులో ప్రత్యేకంగా మిల్లెట్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అధికారిక మెనూలో చిరుధన్యాల వంటకాలను చేర్చారు. డిన్నర్‌లో పాస్తా, ఐస్‌క్రీమ్‌తో సహా అమెరికా అధ్యక్షునికి ఇష్టమైన ఆహారాలు ఉన్నాయి.  విందులో ఫస్ట్ కోర్సులో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలా్, అవకాడో సాస్ ఏర్పాటు చేశారు. మెయిన్ కోర్సులో స్టఫ్డ్ పోర్టబోల్లో మష్రూమ్స్, కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో, లెమన్ దిల్ యోగర్ట్ సాస్, క్రిస్ప్ డ్ మిల్లెట్ కేక్స్, వేసవి పానీయాలు ఉన్నాయి. 

మోదీకి ప్రత్యేక బహమతులు.. 

ప్రధాని మోదీకి.. అమెరికా ప్రెసిడెంట్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ 20వ శతాబ్దం ప్రారంభంలో చేతితో తయారు చేసిన, పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని అందజేశారు. దీంతోపాటు పురాతన అమెరికన్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు. అలాగే  జార్జ్ ఈస్ట్‌మన్ మొదటి కొడాక్ కెమెరా పేటెంట్ ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన హార్డ్‌కవర్ పుస్తకాన్ని కూడా ప్రధాని మోదీకి బహుమతిగా అందజేశారు.

జో బైడెన్ కు ప్రధాని మోదీ బహమతులు..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ప్రధాని మోదీ బహుమతులు అందజేశారు.  రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన  గంధపు పెట్టెను ఇచ్చారు.  ఇది కర్నాటకలోని మైసూర్ నుండి సేకరించిన గంధపు చెక్కతో తయారు చేయబడింది. దీనిమీద రాజస్థాన్‌ పురాతన కళాత్మక, అద్బుతమైన నగిషీలు చెక్కి ఉన్నాయి. ఈ పెట్టెలోపల వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఈ వెండి గణేశుడి విగ్రహాన్ని కోల్‌కతాకు చెందిన ఐదవ తరం సిల్వర్‌స్మిత్‌ల కుటుంబం తయారు చేసింది. వినాయకుడి విగ్రహంతో పాటు వెండి దీపాన్ని అందించారు.  ఈ వెండి దీపం కోల్‌కతాలోని ఐదవ తరం సిల్వర్‌స్మిత్‌ల కుటుంబానికి చెందిన కళాకారులు తయారు చేశారు.

ఒకటో బాక్సులో ఏమున్నాయ్..

ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి ఇచ్చిన బాక్స్ 1లో తామ్ర పాత్ర అని కూడా పిలువబడే రాగి ఫలకం ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దానిపై శ్లోకం రాసిఉంది. పురాతన కాలంలో తామ్ర-పత్రాన్ని రాయడానికి, గ్రంథస్తం చేయడానికి మాధ్యమంగా విస్తృతంగా ఉపయోగించారు.

ఈ  బాక్స్‌లో పది బహుమతులు

  • గో దాన్ కోసం ఆవు స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని కళాకారులు  తయారు చేసిన వెండి కొబ్బరికాయ
  • భూదాన్ కోసం భూమికి బదులుగా కర్ణాటకలోని మైసూర్ నుండి సేకరించిన సువాసనగల గంధపు ముక్క
  • తిల్ లేదా తెల్ల నువ్వులు
  • హిరణ్యదాన్ రాజస్థాన్‌లో చేతితో తయారు చేయబడిన, 24 క్యారెట్ల స్వచ్ఛమైన మరియు హాల్‌మార్క్ ఉన్న బంగారు నాణెం 
  • మహారాష్ట్ర బెల్లం 
  • రాజస్థాన్ కళాకారులు తయారు చేసిన 99.5 శాతం స్వచ్ఛమైన, హాల్‌మార్క్ ఉన్న వెండి నాణెం 
  • గుజరాత్ నుండి సేకరించిన ఉప్పు.. 

జిల్ బైడెన్ కు స్పెషల్ గిఫ్ట్..

అమెరికా క ప్రథమ మహిళ జిల్ బైడెన్ను  ల్యాబ్ గ్రోన్ 7.5 క్యారెట్ గ్రీన్ డైమండ్ ను ప్రధాని మోదీ బహూకరించారు. ఈ గ్రీన్ డైమండ్ ఉంచబడిన పెట్టెను కర్-ఎ-కలమ్‌దానీ అని పిలవబడే, కాశ్మీర్ సున్నితమైన పేపియర్ మాచేలో సక్త్‌సాజీ లేదా పేపర్ గుజ్జు తో తయారు చేశారు. దీనిమీద  నక్కాషి కళ ఉంది.