నక్సలిజం మూలాలను పెకలిస్తం.. కాశ్మీర్ మొత్తం భారత్ లో కలాపాలన్నది పటేల్ ఆకాంక్ష : ప్రధాని మోడీ

నక్సలిజం మూలాలను పెకలిస్తం.. కాశ్మీర్ మొత్తం భారత్ లో కలాపాలన్నది పటేల్ ఆకాంక్ష : ప్రధాని మోడీ

ఢిల్లీ: దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిణమించిందని, దానిని మూలాలను పెకలిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజ రాత్లో ఐక్యతా విగ్రహం వద్ద పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని ప్ర సంగించారు. స్వాతంత్య్రం తర్వాత 550 సంస్థానాలను ఏకం చేసి అసా ధ్యమైన పనిని సుసాధ్యం చేసిన మహ నీయుడు పటేల్ అన్నారు. ఆయనకు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికత అత్యంత ముఖ్యమైందని అన్నారు. దానిని తామూ సమర్థిస్తామని చెప్పారు. 

స్వాతంత్య్ర, గణతంత్రది నోత్సవాల మాదిరిగానే ఏక్తా దివస్ ను జరుపుకొంటున్నామని చెప్పారు. భా రతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, విభజన శక్తుల కు దూరంగా ఉండాలని అన్నారు. కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో కలపాలని పటేల్ ఆకాంక్షించారు. దానిని నెహ్రూ గౌరవించలేదని, పటేల్, అం బేద్కర్ ను కాంగ్రెస్ అవమానించింది. ఆయన దూరదృష్టిని మరిచిపోయిం దని అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్ లో కొంత భాగాన్ని పాకి స్థాన్ ఆక్రమించిందని చెప్పారు. 

ఈ కారణంగా కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొందని తెలిపారు. ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషించిం దని, ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని చెప్పారు. మన దేశం నిజమైన బలం ఏంటో ఆ ఉగ్రవాదుల కు తెలిసిందని చెప్పారు. అక్రమవల సదారులపై చర్యలు తీసుకుంటుంటే కొందరికి బాధగా ఉంటుందని అన్నారు. 

దేశం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేద్దా మనిమోదీ అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల చేశామని చెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటుచేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.