ఇయ్యాల్టి ( డిసెంబర్ 15 ) నుంచి మోదీ 3 దేశాల టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇయ్యాల్టి ( డిసెంబర్ 15 ) నుంచి మోదీ 3 దేశాల టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాల్లో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 18  వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్  దేశాలను సందర్శించనున్నారు. పశ్చిమాసియా , ఆఫ్రికా ప్రాంతాల్లో  దౌత్య, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టారు. ఈ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు ఖండాలను కవర్ చేస్తారు. ద్వైపాక్షిక చర్చలు, వ్యాపార సదస్సులతోపాటు ఇండియన్ కమ్యూనిటీతో సమావేశాలు జరుగనున్నాయి. 

ఈ పర్యటనలో భాగంగా మోదీ మొదట జోర్డాన్ వెళ్తారు. ఆ దేశ రాజు అబ్దుల్లా- 2 ఆహ్వానం మేరకు వెళ్తున్న ప్రధాని.. అక్కడి నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్-–జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ భేటీ నిర్వహిస్తున్నారు. అమ్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొని, ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్యూనిటీతో మోదీ సమావేశమవుతారు. చారిత్రక పేట్రా నగరాన్ని
 క్రౌన్ ప్రిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి సందర్శిస్తారు.