డిసెంబర్ 30న అయోధ్యకు మోదీ

డిసెంబర్ 30న అయోధ్యకు మోదీ

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30న అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనుల ఓపె నింగ్, శంకుస్థాపనలు చేయనున్నట్లు పీఐబీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పునర్​నిర్మించిన అయోధ్య ధామ్ జంక్షన్ తో పాటు ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభిం చను న్నారు. అలాగే దర్బంగా-అయోధ్య- ఆనంద్ విహా ర్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్‌‌ప్రెస్ , మాల్డా ‑ టౌన్-సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ (బెంగ ళూరు) అమృత్ భారత్ ఎక్స్‌‌ప్రెస్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. 

మధ్యా హ్నం రూ.1450 కోట్లతో రెనోవేషన్ చేసిన అయోధ్య ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించి, తరు వాత పబ్లిక్ మీటింగ్ లో రూ.15,700 కోట్ల విలు వ కలిగిన పలు డెవలప్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ ను ఫస్ట్ ఫేజ్​లో రూ.240 కోట్లతో డెవలప్ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మూడు ఫ్లోర్ల లో, లిఫ్ట్​లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతానికి రైల్వే సదుపాయాల ను పెంచేందుకు రూ.2300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నరు.