ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోడీ

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోడీ

ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.  దీని గురించి ప్రాథమిక రిపోర్టును కేంద్రమంత్రులు వివరించారు.  ప్రమాద స్థలంలో జరుగుతున్న  సహాయక చర్యలను ఆరా తీశారు.  మరోవైపు, ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోదీ భేటీ అయ్యారు. . రైలు ప్రమాద బాధితులను  ప్రధాని మోడీ పరామర్శించారు. కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.  క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.