
అక్టోబర్ 16న ప్రధాని మోడీ ఏపీలో పర్యటించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారని ఏపీ బీజేపీ తెలిపింది. శనివారం ( అక్టోబర్ 11 ) మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసింది ప్రభుత్వం. జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటించనున్నారు. కర్నూలు సిటీలో ప్రధాని మోదీతో కలిసి కూటమి నేతల రోడ్ షో ఉంటుంది.
శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని నరేంద్ర మోదీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు కావడంతో కూటమి సర్కార్ అందుకు తగిన ఏర్పాట్లకు సిద్ధమైంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపం తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది కూటమి ప్రభుత్వం.
మోడీ పర్యటన షెడ్యూల్ ఇదే:
- 16న ఉదాయం10:20 గంటలకు కర్నూలు చేరుకోనున్న ప్రధాని మోడీ
- ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్నారు.
- భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శించుకోనున్నారు.
- 16న మధ్యాహ్నం 2:30 గంటలకు..రాగమయూరి గ్రీన్‌హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన
- సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ.