యూఏఈ పర్యటనకు ప్రధాని.. హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోదీ

 యూఏఈ పర్యటనకు ప్రధాని..  హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13, 14 వ తేదీల్లో యూఏఈలో పర్యటించనున్నారు.   ఈ సందర్భంగా ఈ దేశ  అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో విస్తృత చర్చలు జరుపుతారు.  మోదీ, అల్‌ నహ్యాన్‌ భేటీలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం, బలోపేతం చేయడంపై నేతలిద్దరూ చర్చిస్తారు. 

అనంతరం  దుబాయ్ కేంద్రంగా జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024కు గెస్టుగా హాజరై ప్రసంగిస్తారు.  అదేవిధంగా అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తారు. 2015 తర్వాత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.