ప్రజల కోసం చారిత్రాత్మక నిర్ణయం

ప్రజల కోసం చారిత్రాత్మక నిర్ణయం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

హైదరాబాద్: దేశ హితం కోసం.. ప్రజల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ దేశ ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించినందుకు ప్రధాని  నరేంద్రమోడీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు రాష్ట్రాలు ఒక్క రూపాయు కూడా ఖర్చు చేయనవసరం లేకుండా మొత్తం కేంద్రమే వ్యాక్సీన్ కొనుగోలు చేసి దేశంలో ఉన్న పేద, మధ్య, ఉన్నత వర్గాల ప్రజలకు ఫ్రీ గా అందిచాలని ప్రధాని నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయమని బండి సంజయ్ పేర్కొన్నారు. 
 ‘‘దేశ ప్రజల ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయం అద్దం పడుతోంది. ఇది దేశ హితం కోసం ప్రియతమ ప్రధాని తీసుకున్న మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కోట్లాది మంది 45 ఏళ్ల పైబడ్డ వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ వేయించింది. ఇప్పుడు 18 ఏళ్ల పైబడ్డ వాళ్లందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేయించాలన్న నిర్ణయం చూస్తుంటే కరోనానుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వ మొట్ట మొదటి ప్రాధాన్యత అని  ప్రియతమ ప్రధాని మోడీ ప్రకటించారు..’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.