నీటిలో మునిగి ఉన్న ద్వారకలో.. శ్రీకృష్ణునికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

 నీటిలో మునిగి ఉన్న ద్వారకలో.. శ్రీకృష్ణునికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

ప్రధాని మోదీ నీటిలో మునిగి ఉన్న ద్వారకలో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుజరాత్ పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతును ప్రారంభించిన అనంతరం ద్వారక వెళ్లిన ప్రధాని..ఆక్సిజన్ పెట్టుకొని నీటిలో ఉన్న ద్వారకలోని పురాతన శ్రీకృష్ణుని దేవాలయాన్ని వెళ్లారు. శ్రీకృష్ణ భగవానుని దర్శించుకున్నారు. నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం దివ్యవమైన అనుభవం..నేను ఆధ్యాత్రమిక వైభం, కాలాతీత భక్తి పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాను..భగవాన్ శ్రీకృష్ణుడు అందరిని అనుగ్రహించు గాక.. అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

గుజరాత్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  గుజరాత్ లోని ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన తీగలవంతెన (కేబుల్ బ్రిడ్జి) ని  ప్రధాని మోదీ ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రారంభించారు. ‘సుదర్శన సేతు’  పేరుతో రూ. 979 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఓఖా, బేట్ ద్వారకా ద్వీపాలను కలుపుతూ ఈ బ్రిడ్రిని నిర్మించారు. 2017 అక్టోబర్ లో 2.3 కిలోమీటర్ల వంతెనకు  ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇది కొత్త ద్వారక, పాత ద్వారక మధ్య లింక్ గా ఉంటుంది. 

సుదర్శన్ సేతు ఓ ప్రత్యేకమైన డిజైన్.. భగద్గీతలోని శ్లోకాలులతో అలంకరించబడిన ఫుట్ పాత్, రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంటాయి. ఈ తీగల బ్రిడ్జి వెడల్పు 27.20 మీటర్లు, నాలుగు లేన్ల రోడ్డు తో  రెండు వైపులా 2.5 మీటర్ల వెడల్పు గల ఫుట్ పాత్ కలిగి ఉంటుంది. 

గతంలో సిగ్నేచర్ బ్రిడ్జ్ గా పిలువబడిన ఈ వంతెనకు సుదర్శన్ సేతు (సుదర్శన్ బ్రిడ్జి) అని పేరు పెట్టారు. బేట్ ద్వారక అనేది ఓఖా పోర్ట్ సమీపంలో ఉన్న ఓ ద్వీపం. ఇది ద్వారకా పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారాదీష్ దేవాలయం ఉంది. 

సుదర్శన్ సేతుతో పాటు జామ్ నగర్ , దేవభూమి, పోర్ బందర్ జిల్లాలలో 533 కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరణ , పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో రెండు ఆఫ్ షోర్ పైప్ లైన్ లకు ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోదీ.