1000 ఏళ్ల నాటి మసీదును సందర్శించిన మోడీ.. దీని ప్రత్యేకత ఎంటీ?

1000 ఏళ్ల నాటి మసీదును సందర్శించిన  మోడీ.. దీని ప్రత్యేకత ఎంటీ?

ఈజిప్టు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ చారిత్రాత్మకమైన మసీదును సందర్శించారు. ఈ మసీదు పేరు అల్-హకీమ్ .. ఈజిప్టులో ప్రఖ్యాతి గాంచిన ఈ అల్-హకీమ్ మసీదు 11వ శతాబ్దంలో నిర్మించారు. 1000 ఏళ్ల నాటి ఈ మసీదుకు ఈజిప్టులో చారిత్రాత్మకంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో ప్రత్యేకత ఉంది.  

ఈ మసీదు 13,560 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఐకానిక్ సెంట్రల్ ఆవరణ 5,000 చదరపు మీటర్లను ఆక్రమించి ఉంటుంది.  భారత సంతతికి చెందిన దావూదీ బోహ్రా సంఘం వారు దీనిని పునరుద్ధరించారు. ఈ మసీదు ఈజిప్టు రాజధాని కైరోలో ఉంది.  

ఈ మసీదు ప్రధానంగా శుక్రవారం ప్రార్థనలు, మొత్తం ఐదు తప్పనిసరి ప్రార్థనలను నిత్యం నిర్వహిస్తుంది. 1012లో నిర్మించిన మసీదు గోడలు, ద్వారాలపై చెక్కిన క్లిష్టమైన శాసనాలను ప్రధాని ప్రశంసించారు.