ప్రధాని భద్రతకు ఆటంకం.. కాన్వాయ్ కు ఎదురుగా వచ్చిన వ్యక్తి

ప్రధాని భద్రతకు ఆటంకం.. కాన్వాయ్ కు ఎదురుగా వచ్చిన వ్యక్తి

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన సందర్భంగా భద్రతకు విఘాతం కలిగింది. ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఓ వ్యక్తి ప్రధాని మోదీ కాన్వాయ్ ముందుకు దూకాడు. ప్రధాని మోదీ కాన్వాయ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వెలుపల ఈ ఘటన జరిగింది.

ప్రధాని కాన్వాయ్‌కు 20 మీటర్ల దూరంలో..

ఘటన అనంతరం అతడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని బీజేపీ కార్యకర్త కృష్ణకుమార్‌గా గుర్తించారు. ఆయన ప్రధాని కాన్వాయ్‌కు కేవలం 20 మీటర్ల దూరంలో రావడంతో.. అది గమనించిన పోలీసులు, భద్రతా అధికారులు.. వెంటనే అతడిని పట్టుకున్నారు. ఘాజీపూర్ నివాసి అయిన కుమార్... మోదీ కాన్వాయ్ వైపు పరుగెత్తుతూ కనిపించాడు.

Also Read :- కాలేజ్ స్టూడెంట్ స్కూటీపై రాహుల్ గాంధీ చక్కర్లు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ ప్రధాని మోదీని కలవాలనుకున్నాడు. "భరత్ కుమార్ కుమారుడు కృష్ణ కుమార్ సీనియర్ బీజేపీ కార్యకర్త. జాబ్ లేదన్న కారణంతో అతను మానసికంగా కుంగిపోయి, ప్రధాని మోదీని కలవాలనుకున్నాడు" అని ఒక అధికారి తెలిపారు.