కాలేజ్ స్టూడెంట్ స్కూటీపై రాహుల్ గాంధీ చక్కర్లు

కాలేజ్ స్టూడెంట్ స్కూటీపై రాహుల్ గాంధీ చక్కర్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జైపూర్‌లో స్కూటర్ పై చక్కర్లు కొట్టారు. ఒక మహిళా  కాలేజ్ స్టూడెంట్  స్కూటర్‌పై వెనకాల  కూర్చుని వెళ్లారు. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 13 సెకన్ల వీడియో క్లిప్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాహుల్ సెక్యూరిటీ  కలిసి స్కూటర్‌పై కొద్దిసేపు ప్రయాణించారు.  అంతకుమందు  రాహుల్ గాంధీ కూడా మహారాణి  కాలేజీ విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటీలను  పంపిణీ చేశారు.  

కాంగ్రెస్ పార్టీ ఈవీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది.  ఈ వీడియోలో రాహుల్ అమ్మాయి వెనుక కూర్చొని పలువురు విద్యార్థులు ఫోటోలు,  సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. కాంగ్రెస్ ఆయనను రాజస్థాన్‌లో  జన్ నాయక్ (ప్రజల హీరో) అంటూ ట్వీట్ చేసింది. 

 రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఢిల్లీలో రైల్వే కూలీ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే..ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో  రెండ్ కలర్  షర్ట్ వేసుకుని నెత్తిమీద లగేజ్ పెట్టుకుని మోశారు.  రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే అభిమానులను అలరించారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.