- విభజన హామీలు, నిధులు, విధుల గురించి మాట్లాడితే బాగుండేదని వ్యాఖ్య
నిజామాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీది ఫక్తు రాజకీయ పర్యటన అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేశ ప్రధాని హోదాలో హైదరాబాద్ వచ్చిన ఆయన.. బీజేపీ పార్టీ నేతగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల అమలు, నిధులు, విధుల గురించి మాట్లాడకుండా పొలిటికల్ కామెంట్స్‌తో స్థాయిని తగ్గించుకున్నారని విమర్శించారు. ప్రధాని హోదాలో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనడం ఏమిటని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో బీజేపీ మొలకెత్తే చాన్సేలేదన్నారు. దేశ ప్రధానిగా ఏ స్టేట్‌కు వెళ్లినా అక్కడ ఇచ్చే ఫండ్స్, అభివృద్ధి గురించి చెప్పాలని.. కానీ, మోదీ అలా చేయలేదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ లోతెలంగాణలో అన్ని వర్గాలు సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్సేఅధికారంలోకి వస్తుందన్నారు. 92 లక్షల సెక్యులర్ ఓట్లు తొలగించి బెంగాల్‌లో గెలిచిన్రు బెంగాల్లోగెలుపు గురించి గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అక్కడ 92 లక్షల సెక్యులర్ ఓట్లు తొలగిం చిన విషయం ఎందుకు చెప్పడంలేదని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, కుట్రలతో అధికారంలోకి వచ్చారన్నారు. తెలంగాణలో కూడా ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, వారి ఆటలు రాష్ట్రంలో సాగనివ్వమన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ సమాన దూరం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని మహేశ్గౌడ్అన్నారు. ఫక్తు మత రాజకీయాలు చేసే బీజేపీతో సెక్యులర్ విధానాలు పాటించే కాంగ్రెస్ ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. బీజేపీతో కాంగ్రెస్ కలిసి పోయిందంటున్న బీఆర్ఎస్ ఆరోపణలు జోక్ అని కొట్టిపారేశారు. తాము బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సమాన దూరంగా ఉంటామని చెప్పారు. కేసీఆర్ పాలనలో వరి వేస్తే ఉరి అన్నారని.. వాళ్లు వడ్ల కొనుగోలుపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
