అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ను ప్రారంభించిన మోదీ

అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ను ప్రారంభించిన మోదీ

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ ను జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా రైలులోని ప్రయాణికులతో మోదీ  ముచ్చటించారు.  

#WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya, Uttar Pradesh

Developed at a cost of more than Rs 240 crore, the three-storey modern railway station building is equipped with all modern features like lifts, escalators,… pic.twitter.com/oJMFLsjBnp

— ANI (@ANI) December 30, 2023

రూ.240 కోట్లతో మూడు అంతస్థుల్లో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, దుకాణాలు, క్లోక్ రూమ్‌లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి.  

#WATCH | PM Narendra Modi interacts with students onboard the Amrit Bharat train in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/1bEdAgOp3B

— ANI (@ANI) December 30, 2023

ఈ పర్యటనలో భాగంగా 6 వందే భారత్ రైళ్లు, 2 అమృత్ భారత్ రైళ్లను  ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం  యోగి అదిత్యనాథ్,  కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.