నాల్గో టెస్టులో చారిత్రక ఘట్టం..టాస్ వేయనున్న ప్రధాని మోడీ

నాల్గో టెస్టులో చారిత్రక ఘట్టం..టాస్ వేయనున్న ప్రధాని మోడీ

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి టెస్టు జరగనుంది. ఈ నెల 9 నుంచి నాల్గో టెస్టు ప్రారంభం కానుంది. నాల్గో టెస్టు ఓ చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. ఈ మ్యాచ్కు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు..ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ హాజరవనున్నారు. తొలి రోజు ఆటను వీక్షించనున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ టాస్ వేయనున్నట్లు తెలుస్తోంది. 

విజయమే టార్గెట్...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగియగా.... అందులో టీమిండియా రెండింటిలో విజయం సాధించింది. మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో ఈ  సిరీస్ను కైవసం చేసుకోవాలంటే నాలుగో టెస్టును టీమిండియా గెలవడం లేదా...డ్రా చేసుకోవాలి. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును దక్కించుకోవాలంటే గెలవాలి. అటు సిరీస్ను  డ్రా చేసుకోవాలంటే ఆస్ట్రేలియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.