నవంబర్ 11న హైదరాబాద్​కు మోదీ

నవంబర్ 11న హైదరాబాద్​కు మోదీ

హైదరాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల11న హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌం డ్ లో సాయంత్రం జరగనున్న మాదిగల విశ్వరూప ప్రదర్శన సభకు ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్​గా హాజరు కానున్నారు. ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో  జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు హైదరాబాద్ వచ్చిన మోదీ, మళ్లీ ఐదు రోజుల వ్యవధిలోనే సిటీకి వస్తున్నారు. శనివా రం మధ్యాహ్నం 2. 35 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి..సాయంత్రం 4. 45 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకోనున్న మోదీ, సభలో 40 నిమిషాలు ఉంటారు. తర్వా త బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని ఢిల్లీ వెళ్లనున్నారు. ఎస్సీ వర్గీకరణపై మోదీ ప్రసంగిం చనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. వర్గీకరణపై మోదీ ఈ సభా వేదిక నుంచి కీలక ప్రకటన చేసే చాన్స్​ ఉందని పార్టీ నేతలు అంటున్నారు. ఈ సభకు కనీసం లక్ష మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నేతలు.. గ్రేటర్​తోపాటు, రంగారెడ్డి ఉమ్మడి జి ల్లాల నుంచి జనసమీకరణపై దృష్టి పెట్టింది.