కృష్ణా జిల్లాలో 28 మందికి పీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

కృష్ణా జిల్లాలో 28 మందికి పీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

ఎర్రుపాలెం, వెలుగు: నలభై రోజుల కింద ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన కొందరు వేదాద్రి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన మృతిచెందిన వారి కుటుంబాలకు కుటుంబాలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా మంగళవారం కృష్ణాజిల్లా నందిగామలో పిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. మరణించిన వారికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున 28 చెక్కులు, సుమారు రూ 32,50,000 చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ సామినేని ఉదయభాను, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి నగదు సహాయం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. వారిని నమ్ముకున్న కుటుంబాలకు ఊరట నిచ్చే విధంగా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుంచి మంజూరైన చెక్కులు క్షతగాత్రులకు అందించడంతో.. ప్రభుత్వాలు అన్నిటికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము అన్నారు.