పీఎన్‌‌‌‌బీకి రూ.2 వేల కోట్లు టోకరా.. ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈఐ కంపెనీల లోన్లు ఫ్రాడ్‌

పీఎన్‌‌‌‌బీకి రూ.2 వేల కోట్లు టోకరా.. ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈఐ కంపెనీల లోన్లు ఫ్రాడ్‌

న్యూఢిల్లీ: ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈఐ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రూ.2 వేల కోట్లకు పైగా లోన్లను  ఫ్రాడ్ అకౌంట్స్‌‌‌‌గా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐకి   పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌‌‌‌బీ) రిపోర్ట్ చేసింది. ఇందులో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈఐ  ఎక్విప్‌‌‌‌మెంట్ ఫైనాన్స్‌‌‌‌ రూ.1,241 కోట్లు, ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈఐ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌‌‌‌  రూ.1,193 కోట్ల మోసాలు ఉన్నాయి. బ్యాంక్ మొత్తం బకాయికి ప్రొవిజన్‌‌‌‌ చేసింది.

  నేషనల్ అసెట్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌‌‌‌ఏఆర్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌)   2023 ఆగస్టులో  ప్రపోజ్ చేసిన రిజల్యూషన్ ప్లాన్‌‌‌‌ ప్రకారం  ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈఐ ఇన్‌‌‌‌ఫ్రా ఫైనాన్స్​ బోర్డులో భారీ మార్పులు జరిగాయి.  మరోవైపు  పీఎన్‌‌‌‌బీకి ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  రూ.4,904 కోట్ల నికర లాభం వచ్చింది.  ఇది గత సంవత్సరం  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ కంటే 14శాతం ఎక్కువ. 

బ్యాంక్ ఆపరేటింగ్ లాభం క్యూ2లో  రూ.7,227 కోట్లుగా, ఏప్రిల్‌‌‌‌–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో  రూ.14,308 కోట్లుగా నమోదయ్యాయి.  పీఎన్‌‌‌‌బీ  గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల రేషియో సెప్టెంబర్ చివరి నాటికి  4.48శాతం నుంచి 3.45శాతానికి మెరుగుపడింది.