
హైదరాబాద్, వెలుగు: మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోక్సో యాక్ట్ సహా వివిధ ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా యూట్యూబ్ నిర్వాహకుల వివరాలను సేకరిస్తున్నట్లు సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. స్వేచ్ఛ ఉంది కదా అని
సోషల్ మీడియాలో అడ్డగోలుగా వీడియోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదన్నారు. బాధ్యులపై పోలీస్ శాఖ చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.