ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబాబాద్, వెలుగు: పోడు రైతులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అటవీ హక్కు పత్రాలు అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మహబూబాబాద్​కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్​పర్సన్​ ​ బిందులతో కలిసి పరిశీలించారు. కలెక్టరేట్​లో కలెక్టర్ ఛాంబర్, వీఐపీ గదులు, ప్లాంటేషన్ పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాకు రానున్నందున పర్యటన ఏర్పాట్లను స్పీడప్​ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఇల్లందు రోడ్డులో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, అందుకు స్థలం చదును చేయాలన్నారు. సభ వేదికపై సీఎం కేసీఆర్ ​పోడు రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గొత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మృతి బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అభిలాష అభినవ్,  డేవిడ్, ఆర్అండ్​బీ ఈఈ తానేశ్వర్,  డీఈ రాజేందర్,  మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​వెంకటేశ్వర్లు, తహసీల్దార్​నాగభవాని పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

తొర్రూరు, వెలుగు : బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. తొర్రూరు మండలం వెలికట్టకు చెందిన టీఆర్ఎస్​ వార్డు మెంబర్​ దీకొండ రజిత భర్త రామచందర్​, నాంచారి మడూర్ గ్రామానికి చెందిన నలమాస చిన్న ఎల్లగౌడ్​ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. గురువారం బాధిత కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. మంత్రి వెంట ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, లీడర్లు ఉన్నారు.

మహబూబాబాద్​లో బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్ర  ప్రారంభం

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ లో బ్యాంక్ ఆఫ్​మహారాష్ట్ర బ్రాంచ్ ను కలెక్టర్ కె.శశాంక గురువారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ బ్యాంకు ద్వారా ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్, ఇతర లోన్లు తీసుకోవడానికి ఇక్కడి ప్రజలకు అవకాశం లభించిందన్నారు. డిప్యూటీ జోనల్ మేనేజర్ జి. అనంత్ కుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకు ఆఫ్​మహారాష్ట్ర సేవలందిస్తోందన్నారు. తెలంగాణలోని 23 జిల్లాల్లో బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్ర 46 బ్రాంచ్ లు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ బ్రాంచ్ మేనేజర్ బి.సురేశ్​ 
తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్​లో చేరికలు 

హసన్ పర్తి,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్​లో చేరుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​అన్నారు. గురువారం 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి కందుకూరి సాయి చంద్ తో పాటు మరో 50 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్​లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పంచాయితీలకు ఫండ్స్​ వస్తలేవ్​

ధర్మసాగర్, వెలుగు: పంచాయతీలకు ఫండ్స్​ వస్తలేవని, సిబ్బందికి జీతాలు ఎట్లా ఇవ్వాలని సర్పంచ్​లు  ప్రశ్నించారు. ధర్మసాగర్ మండల జనరల్​బాడీ సమావేశం గురువారం ఎంపీపీ  నిమ్మ కవిత రెడ్డి అధ్యక్షతన వాడీవేడిగా జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గత సమావేశంలో విన్నవించిన సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదని అధికారులపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల దగ్గర కాంటా ఎక్కువ కొడుతున్నారని ధర్మసాగర్ ఎంపీటీసీ రాజు ఏవో, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు తరచూ పగిలిపోయి వాటి నిర్వహణ ఖర్చు సర్పంచ్​లపై పడుతుందన్నారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ  వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు సందర్శించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. పంచాయతీలకు ఫండ్స్​వచ్చేలా చూడాలని సర్పంచ్​లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. 

కొత్త ఫైరింగ్​ రేంజ్​ప్రారంభం

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం శివారులో కొత్తగా నిర్మించిన ఫైరింగ్ రేంజ్ ను సీపీ డా.తరుణ్ జోషి గురువారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా పోలీస్​ కమిషనర్​తోపాటు డీసీపీలు, అడిషనల్​డీసీపీలు, ఏసీపీలు ఫైరింగ్ ప్రాక్టీసు  చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ గతంలో వరంగల్​ కమిషనరేట్ పరిధిలోని అధికారులు, సిబ్బంది శిక్షణ కోసం ప్రత్యేకంగా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫైరింగ్​ రేంజ్​ నిర్మాణంలో శ్రమించిన అధికారులు, సిబ్బందికి సీపీ తరుణ్​జోషి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు అశోక్ కుమార్, వెంకటలక్ష్మి, సీతారాం, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, సంజీవ్, సురేశ్, ఏసీపీలు, ఆర్.ఐలు, ఇన్​స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణాలు వెంటనే పూర్తి చేయాలి:  కలెక్టర్​ సీహెచ్​ శివలింగయ్య

జనగామ అర్బన్​, వెలుగు: జిల్లాలో గ్రౌండింగ్​లో ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్​ సీహెచ్​ శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, హరితహారంపై అడిషనల్​ కలెక్టర్ ​ప్రపుల్​ దేశాయ్​ తో కలిసి కలెక్టర్​ అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ కార్యదర్శులు, ఎంపీడీవోలు గ్రామస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వసంత, డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి, ఎంపీడీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

కంట్రోల్​ రూమ్​ తనిఖీ 

జనగామ అర్బన్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూమ్​ను కలెక్టర్ శివలింగయ్య గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఇప్పటివరకు ఈ సెంటర్​కు 13 కాల్స్​ వచ్చాయని ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారం చూపించామన్నారు. కొనుగోలు సెంటర్లలో వసతులు, ఇతర సమస్యలపై 6303928718 నంబర్​ కు కాల్​ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. 

వీధి కుక్కల నియంత్రణకు ‘కుని’ ఆపరేషన్లు

వరంగల్​సిటీ, వెలుగు: బల్దియా ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణకు ‘కుని’ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు.  గురువారం 1వ డివిజన్ హాసన్ పర్తి వద్ద బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుక్కల శస్త్ర చికిత్స కేంద్రాన్ని మేయర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  మేయర్ మాట్లాడుతూ వీధి కుక్కల బెడదను  అరికట్టేందుకు ప్రతిరోజు 25 నుంచి 30 కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అగ్రకుల పార్టీలన్నీ వ్యాపార కంపెనీలే :డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: అగ్రకుల పార్టీలన్నీ వ్యాపార కంపెనీలేనని డీఎస్పీ(దళిత్ శక్తి ప్రొగ్రామ్) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. గురువారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి స్వరాజ్య పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి, తహసీల్దార్​ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెచ్చుకున్న తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వాటా ఎంత అని ప్రశ్నించడానికి సబ్బండ కులాలు పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. నూటికి పది శాతం లేని రెడ్డి, వెలమల చేతుల్లోనే భూమి, రాజ్యం, సంపద ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, జిల్లా అధ్యక్షులు సుధాకర్, లక్ష్మణ్, రాజ్​కుమార్​ పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణాలు వెంటనే పూర్తి చేయాలి:   కలెక్టర్​ సీహెచ్​ శివలింగయ్య

జనగామ అర్బన్​, వెలుగు: జిల్లాలో గ్రౌండింగ్​లో ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్​ సీహెచ్​ శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, హరితహారంపై అడిషనల్​ కలెక్టర్ ​ప్రపుల్​ దేశాయ్​ తో కలిసి కలెక్టర్​ అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ కార్యదర్శులు, ఎంపీడీవోలు గ్రామస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వసంత, డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి, ఎంపీడీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

కంట్రోల్​ రూమ్​ తనిఖీ 

జనగామ అర్బన్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూమ్​ను కలెక్టర్ శివలింగయ్య గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఇప్పటివరకు ఈ సెంటర్​కు 13 కాల్స్​ వచ్చాయని ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారం చూపించామన్నారు. కొనుగోలు సెంటర్లలో వసతులు, ఇతర సమస్యలపై 6303928718 నంబర్​ కు కాల్​ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. 

ధరణితో రైతుల పొట్ట కొడుతున్నారు:ఎమ్మెల్యే సీతక్క

నెట్​వర్క్​, వెలుగు: ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని మహిళా కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గురువారం ములుగులోని తహసీల్దార్​ ఆఫీస్​ఎదుట  కాంగ్రెస్​  జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు కష్టాలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని విమర్శించారు. ధరణి పోర్టల్​ తో మోసాలు జరుగుతున్నాయని, రైతులు తమ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో కాలయాపన చేస్తోందన్నారు. ధరణిని ​రద్దు చేయాలని వరంగల్​జిల్లా సంగెం మండలంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ధర్నా నిర్వహించారు.మహబూబాద్​జిల్లాకేంద్రంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు భరత్​చంద్​రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారు. బచ్చన్నపేటలో మాజీ మంత్రి పొన్నాల క్ష్మయ్యకు రైతులు సమస్యలు చెప్పుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొర్రూర్, హసన్​పర్తి, కమలాపూర్, మరిపెడ, వెంకటాపూర్, నల్లబెల్లి, కొత్తగూడ, మొగుళ్లపల్లి, రేగొండ, టేకుమట్ల, ఎల్కతుర్తి మండలాల్లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.

హక్కు పత్రాల నమోదు పక్కాగా చేయాలి:   కలెక్టర్​ కృష్ణ ఆదిత్య 

ములుగు, వెలుగు: పోడు భూముల సర్వే అనంతరం చేపడుతున్న హక్కుపత్రాల నమోదు పక్కాగా చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్​ ఎస్​.కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం ములుగు కలెక్టరేట్​లో పీవో అంకిత్​తో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ 
ఎంతోకాలంగా సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న అర్హులైన గిరిజనులకు అటవీ హక్కు పత్రాల నమోదు ప్రక్రియ స్పీడప్​ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, డీడీ పోచం, మండల ప్రత్యేక అధికారులు అప్పయ్య, భాగ్యలక్ష్మీ, జడ్పీటీసీ రుద్రమదేవి, ఎంపీపీ రజిత పాల్గొన్నారు.ఫారెస్ట్​ సిబ్బందికి వెపన్స్​ ఇవ్వాలి

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: పోడుదారులు, స్మగ్లర్ల నుంచి రక్షణకు   వెపన్స్​ ఇవ్వాలని అటవీశాఖ తెలంగాణ జూనియర్​ ఆఫీసర్స్​అసోసియేషన్​ డిమాండ్​చేసింది. ఖమ్మం జిల్లాలో చనిపోయిన ఎఫ్ఆర్వో శ్రీనివాస్​కు గురువారం నివాళులర్పించారు.అనంతరం టౌన్​లో బైక్​ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్​కు చేరుకొని కలెక్టర్​శశాంకకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్​జిల్లా అధ్యక్షుడు సాంబు, లీడర్లు రమేశ్​, సత్యం, వసంతరాణి, బాలనాగు, విక్రంకుమార్​, రవీందర్​ పాల్గొన్నారు. 

పుట్ట మధు పరామర్శ 

మల్హర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో గురువారం పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పర్యటించారు. మండలంలోని మల్లారం, పెద్దతూండ్ల, కిషన్ రావు పల్లి, తాడిచెర్ల గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను జడ్పీ చైర్మన్ మధు, జిల్లా యువజన నాయకులు జక్కు రాకేశ్​తో కలిసి పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు భూపెల్లి రాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస రావు, పీఏసీఎస్​ఇన్​చార్జి చైర్మన్ సూర్య ప్రకాశ్​రావు, లీడర్లు పాల్గొన్నారు.