
దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఇలియానా.తెలుగుతో పాటుగా తమిళ సినిమాల్లో కూడా నటించిన ఈ గోవా బ్యూటీ అక్కడ కూడా అదరగొట్టేసింది.తెలుగులో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బర్ఫీ సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అయితే అక్కడ స్టార్ రేంజ్ అందుకోలేదు సరికదా సౌత్ సినిమా ఆఫర్లు కూడా మిస్ చేసుకుంది.తర్వాత మళ్లీ తెలుగు ఆఫర్ల కోసం ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు.ఆ తర్వాత అనేక ఇల్లీ బేబీ లైఫ్ అనేక మలుపులు తిరిగింది.మైఖెల్ డోలన్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఇలియానా అతనితో ఒక బాబుని కూడా కనేసింది.
తాజా విషయానికి వస్తే..ఇప్పుడు తనకు స్టార్ డం తెచ్చిన తెలుగు పరిశ్రమ మీదే అమ్మడు ఆశలు పెట్టుకుంది. తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తుంది ఇలియానా. మొన్నటిదాకా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని అలరించిన అమ్మడు ఇప్పుడు అదే క్రేజ్ తో సినిమా ఛాన్సులు అందుకోవాలని చూస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే..ఇలియానా చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. ఏదైనా సినిమా ఛాన్స్ వస్తే మాత్రం నో లిమిట్స్ అనే రేంజ్ లో అందాల ప్రదర్శనకు సిద్ధం అవుతుందీ అమ్మడు. ఏం చేసైనా సరే తెలుగులో చాన్స్ కొట్టేయాలని చూస్తోంది. మారే ఏ డైరెక్టర్ ఆదుకుంటాడో చూడాలి.