పోక్సో కేసులో ఓ వ్యక్తికి జీవితఖైదు విధించిన మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు

పోక్సో కేసులో  ఓ వ్యక్తికి జీవితఖైదు విధించిన మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు

దుండిగల్, వెలుగు: పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి అమరావతి తీర్పు చెప్పారు.దుండిగల్ పరిధిలో 2018లో ఓ బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బోరంపేటకు చెందిన కోమరి శివకుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. తాను ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేశానని, తర్వాత ఇంటికి వెళ్లిపోయానని చెప్పాడు. ఆమె పలుమార్లు ఫోన్ చేయగా.. బెదిరించానన్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నాడు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన అప్పటి పోలీసులు కోర్టులో చార్జిషీట్​దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో సోమవారం శివకుమార్​కు కోర్టు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.