పోక్సో కేసులను నిర్లక్ష్యం చేయొద్దు.. 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలి

పోక్సో కేసులను నిర్లక్ష్యం చేయొద్దు.. 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలి
  •     ఐజీపీ షానవాజ్ ఖాసీం

వనపర్తి, వెలుగు: పోక్సో, ఎస్సీ/ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని మల్టీజోన్-2 హైదరాబాద్ ఐజీపీ షానవాజ్ ఖాసీం ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ ఉండాలని, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని జోగులాంబ జోన్-7 డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్​తో కలిసి సందర్శించారు. 

అనంతరం పోలీసు అధికారులతో సమీక్షించారు. లాడ్జీలు, పాత నేరస్తులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు అధికారులు, వీఆర్వోలు, బీట్ అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

రికార్డుల నిర్వహణలో 5ఎస్​ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ సునీతారెడ్డి, ఏఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, వనపర్తి డీఎస్పీ గిరిబాబు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.