మెదక్: పోలంపల్లి సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు

మెదక్: పోలంపల్లి సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు

మెదక్, వెలుగు:  చేగుంట మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం 37 ప్రకారం అధికారాలను, దుర్వినియోగం చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు.

హరితహరంలో నాటిన మొక్కలను సర్పంచ్ భర్త నరికి వేశారని, గ్రామపంచాయతీ ఫర్నిచర్ ధ్వంసం,  మరుగుదొడ్లు కూల్చివేత, ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీకి తాళం వేయడం వంటి అభియోగాలు వచ్చాయి. ఈ మేరకు తూప్రాన్ డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ జరిపి అందించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ప్రతిమ సింగ్ చర్యలు తీసుకున్నారు.