
హైదరాబాద్, వెలుగు : పోలవరం ప్రాజెక్టు అథారిటీ16వ మీటింగ్ ను ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని పీపీఏ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతూ పీపీఏ మెంబర్ సెక్రటరీ రఘురామ్ కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు, ఇరిగేషన్, ఏపీ జెన్ కో ఇంజనీర్లకు లేఖ రాశారు. సమావేశంలో పీపీఏ హెడ్ క్వార్టర్స్ ను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం నగరానికి తరలించడం సహా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తామని తెలిపారు.