ఫైన్లు కట్టాల్సిందే.. కోర్టుకెళ్లాల్సిందే!

ఫైన్లు కట్టాల్సిందే.. కోర్టుకెళ్లాల్సిందే!
  • లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ రూల్స్​ బ్రేక్​ కేసుల్లో పోలీసుల చర్యలు
  • 4.64 లక్షల మందిపై  కర్ఫ్యూ వయొలేషన్‌‌‌‌
  • ఈ –పెటీ కేసుల్లో ఫైన్లు, ఐపీసీ కేసుల్లో  కోర్టుకు
  • వాహనదారులకు ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ ద్వారా సమాచారం 

 ‘శేఖర్‌‌‌‌‌‌‌‌ లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్​లో రోడ్డుపైకి వచ్చాడు. కూకట్‌‌‌‌పల్లి చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వద్ద పోలీసులు వెహికల్‌‌‌‌ సీజ్‌‌‌‌ చేశారు. డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌, ఆధార్‌‌‌‌‌‌‌‌, ఆర్సీ తీసుకుని వెహికల్‌‌‌‌ ఇచ్చేశారు.  తర్వాత అతడిపై కేసు రిజిస్టర్ అయ్యిందని, కోర్టుకు అటెండ్ కావాలని పోలీసుల నుంచి మెసేజ్‌‌‌‌ వచ్చింది’. శేఖర్‌‌‌‌‌‌‌‌ ఒక్కడే కాదు, ఇలా సెకండ్​ వేవ్​ లాక్‌‌‌‌డౌన్ రూల్స్ బ్రేక్‌‌‌‌ చేసిన వాహనదారులకు పోలీసులు మెసేజ్​లు పంపిస్తున్నారు. పెటీ కేసుల్లో ఫైన్లు, ఐపీసీ సెక్షన్స్‌‌‌‌తో కోర్టుకు అటెండ్‌‌‌‌ కావాలని చెప్తున్నారు.


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ రూల్స్​ బ్రేక్ చేసిన కేసుల్లో  పరిష్కారానికై పోలీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్ చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు, సీజ్ చేసిన వెహికల్స్ రిలీజ్‌‌‌‌ కోసం సర్క్యూలర్ జారీ చేసింది. మాస్క్‌‌‌‌ వయొలేషన్‌‌‌‌, పబ్లిక్ గ్యాదరింగ్స్‌‌‌‌, ఫిజికల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ సహా జరిమానాలు విధించిన కేసుల్లో ఈ– చలాన్ పేమెంట్స్‌‌‌‌తో కేసు క్లోజ్‌‌‌‌ చేయాలని ఆదేశించింది. నేషనల్‌‌‌‌ డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ కింద నమోదైన కేసుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని సూచించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌‌‌‌(ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓ)కు ఇంటర్నల్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్ ఇష్యూ చేసింది.
లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో 6 లక్షల ఈ– పెటీ కేసులు
కరోనా సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌ లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో మే12 నుంచి ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 313 కేసులు రిజిస్టర్‌‌‌‌ అయ్యారు. ఇందులో 4,64,070 కర్ఫ్యూ వయొలేషన్‌‌‌‌ కేసులు. వీటితోపాటు మరో 1,36,243 మాస్క్‌‌‌‌, ఫిజికల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌, పబ్లిక్‌‌‌‌ గ్యాదరింగ్స్‌‌‌‌పై పోలీసులు ఈ–పెటీ కేసులు నమోదు చేశారు. ఇలాంటి కేసుల్లో స్థానిక మీ సేవ సెంటర్లు లేదా పోలీస్ ఈ ఛలాన్ సిస్టమ్‌‌‌‌లో ఫైన్లు చెల్లించవచ్చు. నేషనల్‌‌‌‌ డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ కింద కేసులు నమోదైన వాహనదారులపై కోర్టులో ఛార్జిషీట్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేయనున్నారు. ఇందుకోసం స్థానిక కోర్ట్‌‌‌‌ కానిస్టేబుల్స్‌‌‌‌ కేసులను మానిటర్ చేస్తున్నారు. కొవిడ్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను ఫాలో అవుతున్నారు.
పోలీసుల వద్దే ఒరిజినల్ డాక్యుమెంట్లు
లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు వెహికల్‌‌‌‌ చెకింగ్ చేసిన సంగతి తెలిసిందే. చెక్‌‌‌‌పోస్టులు,రోడ్లపై తనిఖీలు చేసి ఈ–పెటీ కేసులు పెట్టి చలాన్లు జారీ చేశారు. రూల్స్​ బ్రేక్ చేసి  రోడ్లపైన తిరిగిన వారి ఫొటో, వెహికల్‌‌‌‌ ఫొటో తీసుకున్నారు. డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు,ఆధార్‌‌‌‌‌‌‌‌కార్డులను కేసుల డేటాతో లింక్ చేశారు. సీజ్ చేసిన వెహికల్స్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌ కోసం స్థలం లేకపోవడంతో వాహనదారులకే వాటిని అప్పగించారు. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లను మాత్రం కస్టడీలోకి తీసుకున్నారు. 
ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌తో సమాచారం
లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ముగియడంతో  కేసులు క్లోజింగ్‌‌‌‌పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. కోర్టుకు అటెండ్‌‌‌‌ కావాల్సిన వాహనదారుల కేసుల వివరాలు కలెక్ట్‌‌‌‌ చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక కోర్టు జడ్జిల నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు. కోర్టులు ఇచ్చే డేట్స్ ఆధారంగా ఆయా పోలీస్‌‌‌‌ స్టేషన్లలో నమోదైన కేసుల్లో వాహనదారులకు మెసేజ్‌‌‌‌ పంపిస్తున్నారు. వెహికల్‌‌‌‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌‌‌‌ తీసుకుని కోర్టుకు అటెండ్ కావాల్సిందిగా సూచించారు. ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ లేదా కాల్స్ చేసి కోర్ట్‌‌‌‌ హియరింగ్​కు రావాలని చెప్తారు. కేసులో విచారణ ముగిసిన తరువాత పోలీసులు సీజ్ చేసిన డాక్యుమెంట్లను అందిస్తారు.