తెలంగాణ అసెంబ్లీ దగ్గర మాజీ సర్పంచ్ లు అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ దగ్గర మాజీ సర్పంచ్ లు అరెస్ట్

బీఆర్ఎస్ పార్టీ హయాంలో.. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని.. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచ్ లు ఆందోళనకు దిగారు. 2025, డిసెంబర్ 29వ తేదీ ఉదయం.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో.. ఈ మాజీ సర్పంచ్ లు అందరూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. 

అసెంబ్లీ జరుగుతున్న సమయం కావటంతో.. పోలీసులు మాజీ సర్పంచులను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటూ ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు మాజీ సర్పంచ్ లు. 

పాత బిల్లులు రాక రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సర్పంచ్ లు. ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు మాజీ సర్పంచ్ లు.