పోడు పట్టాల కోసం కేసీఆర్ కాన్వాయ్‭ను అడ్డుకున్రు

పోడు పట్టాల కోసం కేసీఆర్ కాన్వాయ్‭ను అడ్డుకున్రు

మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా న్యూ డెమోక్రసీ నేతలు నిరసన తెలిపారు. సీఎం కాన్వాయ్‭ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రోడ్డు పై ఆందోళన నిర్వహించారు. దీంతో న్యూ డెమోక్రసీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. పోలీసుల తీరుపై వారు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పర్యటనతో విపక్ష నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. 

పట్టణంలో ఇండ్ల స్థలం లేనివారు, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలకు హక్కులు కల్పించాలని న్యూ డెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే వారికి విద్యుత్, నల్లాలు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆందోళన చేశారు. జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్దికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే కొత్త జిల్లాల అభివృద్ధి జరుగుతుందని న్యూ డెమోక్రసీ నేతలు అభిప్రాయపడ్డారు.