ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు రిమాండ్ కు 8 మంది

ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు రిమాండ్ కు 8 మంది

కామారెడ్డి, వెలుగు: ఫేక్​ కరెన్సీ తయారు చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును కామారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు. బిహార్, వెస్ట్ బెంగాల్, చత్తీస్​గఢ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణకు చెందిన 12 మంది సభ్యుల్లో 8 మందిని అరెస్టు చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా పోలీసు ఆఫీస్​లో ఎస్పీ రాజేశ్​చంద్ర వివరాలను వెల్లడించారు. 

కామారెడ్డిలోని ఓ వైన్స్​లో సెప్టెంబర్​ 23న రామేశ్వర్​పల్లికి చెందిన సిద్ధాగౌడ్​ 2 ఫేక్​ రూ.500 నోట్లు ఇచ్చి మధ్యం కొన్నాడు. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఫేస్​బుక్​ ద్వారా వెస్ట్​ బెంగాల్​కు చెందిన సౌవర్​ డేను సంప్రదించి నకిలీ నోట్లను తెప్పించుకున్నట్లు చెప్పాడు. 

సీసీఎస్​, కామారెడ్డి టౌన్​, సదాశివనగర్ సీఐలతో 8 బృందాలు ఏర్పాటై దర్యాప్తు ముమ్మరం చేశాయి. వెస్ట్​ బెంగాల్, బిహార్, యూపీ, మహారాష్ట్రకు వెళ్లి 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ముఠా నుంచి రూ.3,08,300 ఫేక్​ కరెన్సీ, రూ.15,300 ఒరిజినల్​ కరెన్సీ, కారు, 9  ఫోన్లు, బాండ్​ పేపర్లు, కరెన్సీ ప్రింటింగ్​కు ఉపయోగింగిన ప్రింట్​ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సీ చైతన్యరెడ్డి, సీఐలు శ్రీనివాస్​, నరహరి, సంతోష్, ఎస్సైలు రాజు, రాజశేఖర్​, అనిల్​, ఉస్మాన్​కు ఎస్పీ రివార్డులు అందజేశారు.