ఎంపీగా కరీంనగర్‭కు ఏం చేశావ్.. బండి సంజయ్‭పై కాంగ్రెస్ ఫైర్

ఎంపీగా కరీంనగర్‭కు ఏం చేశావ్.. బండి సంజయ్‭పై కాంగ్రెస్ ఫైర్

బీజేపీ కరీంనగర్ సభ నేపథ్యంలో బండి సంజయ్‭కు వ్యతిరేకంగా కరీంనగర్ తెలంగాణ చౌక్‭లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీగా కరీంనగర్‭కు ఏం చేశావంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా.. బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పర దాడులకు ప్రయత్నించారు.  

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. బీజేపీ నేతలను అక్కడి నుంచి పంపించి వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బండి సంజయ్‭కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.