మేం రైతులం.. అదరం బెదరం : సర్వర్ సింగ్ వార్నింగ్

మేం రైతులం.. అదరం బెదరం : సర్వర్ సింగ్ వార్నింగ్

మేం రైతులను.. మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి మేం రాజకీయ పార్టీలం కాదు.. రైతులను.. ఆందోళనలపై వెనక్కి తగ్గేది లేదు.. ఢిల్లీని ముట్టడిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు రైతు సంఘాల ప్రతినిధి సర్వర్ సింగ్ పందేర్. రైతులపై రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపి.. టియర్ గ్యాస్ ప్రయోగించి.. రైతులను భయాందోళనలకు గురి చేయాలని చూస్తుందంటూ.. మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. ఫిబ్రవరి 14వ ఉదయం ఢిల్లీకి వస్తున్న రైతులను సరిహద్దుల్లోని శంభు దగ్గర అడ్డుకుని అరెస్టులు చేస్తున్నట్లు ప్రకటించారాయన.

రైతుల వెనక రాజకీయ పార్టీలు లేవని.. ఇది రైతు ఉద్యమం అని ప్రకటించిన ఆయన.. 23 పంటలకు మద్దతు ధరను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధర చట్టం, రైతు రుణమాఫీ, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ, కాలుష్య చట్టం నుంచి వ్యవసాయాన్ని తొలగించడం, రైతులపై కేసులు ఎత్తివేయడం, ఆదివాసీ భూ హక్కులను కాపాడటం మా ప్రధాన డిమాండ్లు అని ప్రకటించారు సర్వర్ సింగ్ పందేర్. 

రైతులపై టియఆర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించడాన్ని రైతు సంఘాలు ఖండించాయి. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. మోదీ ప్రభుత్వం రైతులపై తన బలాన్ని ప్రయోగిస్తుందని మండిపడ్డాయి. పంటలకు మద్దతు ధర చట్టం, రైతు రుణమాఫీ, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ, కాలుష్య చట్టం నుంచి వ్యవసాయాన్ని తొలగించడం, రైతులపై కేసులు ఎత్తివేయడం, ఆదివాసీ భూ హక్కులను కాపాడటం తమ ప్రధాన డిమాండ్లని వెల్లడించారు రైతు సంఘాల నాయకులు. ఢిల్లీ వెళ్లడం తమ హక్కు అని.. తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ వెళ్తున్నామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం బ్యారిగేట్లు పెట్టి అడ్డుకుంటుందని విమర్శించారు. 

తమ వెనక ఏ రాజకీయ పార్టీ లేదని.. తాము దేశ రైతులమని చెప్పారు రైతు సంఘ నాయకులు. రైతుల డిమాండ్లు పెరుగుతుపోతున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అనడం సరికాదని.. తాము మొదటినుంచి అడుగుతున్న డిమాండ్లనే నెరవేర్చాలని వారు కోరారు. 23 పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని.. పంటల మద్దతు ధరకు చట్టబద్దత వస్తే భద్రత ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో హర్యానా, -పంజాబ్ సరిహద్దుల్లో రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులను బెదిరించాలని చూస్తున్నారని... ప్రధాని పెద్దమనసు చేసుకొని తమ పంటల మద్దతు ధర చట్టం చేసి.. రైతులకు న్యాయం చేయాలని కోరారు.