గవర్నమెంట్ స్కూల్లో జాబ్ పేరుతో లక్షలు వసూలు.. ప్రిన్సిపాల్ అరెస్ట్..

గవర్నమెంట్ స్కూల్లో జాబ్ పేరుతో లక్షలు వసూలు.. ప్రిన్సిపాల్ అరెస్ట్..

ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. వంద మంది ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు మధుకిరణ్. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అనంత్ ఈ సోలుషన్స్ అనే సంస్థ నిర్వాహకుడు మధుకిరణ్ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వంద మంది నిరుద్యోగుల దగ్గ లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు మధుకిరణ్.

మోసపోయామని గ్రహించిన బాధితులు బోథ్, ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసుతో సంబంధం ఉన్న బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విఠల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు . 

పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మధుకిరణ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. కష్టపడకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రావని..  అడ్డదారిలో ఉద్యోగం కోసం డబ్బులు కట్టి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.