మాదాపూర్ కాల్పుల కేసు చేధించిన పోలీసులు

మాదాపూర్ కాల్పుల కేసు చేధించిన పోలీసులు

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలా పత్తర్ లో రౌడీ షీటర్ ఇస్మాయిల్ హత్య కేసును పోలీసులు చేధించారు. కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, ఎస్ఓటీ పోలీసులు 24 గంటల్లోనే  నిందితులు జిలానీ, మునాయిద్, ఫిరోజ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సోమవారం హైదరాబాద్ లోని మాదాపూర్లో  కాల్పులు కలకలం సృష్టించాయి. ఉదయం నీరూస్ సర్కిల్లో  ఇస్మాయిల్ అనే రౌడీ షీటర్ పై మరో రౌడీ షీటర్ కాల్పులు జరిపి పరారయ్యాడు. ఇస్మాయిల్ మృతి చెందగా.. జాంగీర్  అనే  మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన  అతడిని  స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల  గాలింపు చేపట్టారు.

ల్యాండ్ వివాదం సెటిల్మెంట్ కోసం తెల్లవారుజామున నీరూస్ సిగ్నల్ అయ్యప్ప సొసైటీ  వద్దకు రెండు గ్రూప్ లు చేరుకున్నాయి. అయితే చర్చలు జరుగుతున్న సమయంలోనే ఓ రౌడీషీటర్ కాల్పులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.