వ్యాపారవేత్త బంగ్లా కబ్జా.. నిందితులకు రిమాండ్

వ్యాపారవేత్త బంగ్లా కబ్జా.. నిందితులకు రిమాండ్

జూబ్లీహిల్స్, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లతో ఓ వ్యాపారవేత్త ఇంటిని కబ్జా చేసి, అతని కొడుకుపై దాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త సునీల్ కుమార్ ఆహుజాకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లో బంగ్లా ఉంది. గతేడాది డిసెంబర్ 9న ఆహుజా కొడుకు ఆశిష్ కుమార్ ఆ బంగ్లాకు వెళ్లగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉండడంతో ప్రశ్నించాడు. 

దీంతో అతడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఆశిష్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి పోలీసులు.. నకిలీ డాక్యుమెంట్లతో ఇంటిని ఆక్రమించినట్లు గుర్తించారు. సీసీటీవీ కెమెరాలు, ఇతర ఆధారాల ద్వారా నిందితులైన పోలవరపు శ్రీదేవి, టి. నయంత్, పాలేటి శ్రీనాథ్ రెడ్డి శనివారం అరెస్టు చేశారు. వీరిపై ఫోర్జరీ, దోపిడీ, దాడి వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.