ఇందిరాపార్క్ లో టెన్షన్.. నేతల అరెస్ట్

ఇందిరాపార్క్ లో టెన్షన్.. నేతల అరెస్ట్

ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు.. సెక్రటేరియట్ కు ర్యాలీగా బయల్దేరి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే.. అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, చింతల రామచంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్, పీఓడబ్ల్యూ సంధ్య ఇతరులు పాల్గొన్నారు. వీరిని బలవంతంగా అరెస్ట్ చేసి… వాహనాలు ఎక్కించారు పోలీసులు. బొలారం, గోషామహల్ స్టేడియానికి తీసుకెళ్లారు. కేసీఆర్ నియంతృత్వం నశించాలి.. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.. అంటూ నినాదాలు చేశారు నాయకులు. సెక్రటేరియట్ వరకు శాంతియుత ర్యాలీకి అనుమతివ్వని పోలీసుల తీరును తప్పుపట్టారు.