డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులపై దాడి ..ఇద్దరిపై కేసు నమోదు

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులపై దాడి ..ఇద్దరిపై కేసు నమోదు

ధర్మసాగర్​, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఎస్సై దిలిప్​ తో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్​ రాత్రి పీఎస్​ ఎదుట తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో బైక్‌‌‌‌ను ఆపి తనిఖీ చేస్తుండగా.. అతనికి 138 మిల్లీగ్రామ్ ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు బైక్​ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా, బైక్​ పై ఉన్న ఇద్దరూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులపై దాడి చేసి విధి నిర్వహణకు ఆటంకం కలిగించారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముప్పారం గ్రామ డైరీ ఆవిష్కరణ

ధర్మసాగర్, వెలుగు: ముప్పారం గ్రామ డైరీని గురువారం  కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కి  సర్పంచ్ గుంటిపల్లి రేణుక అందజేశారు. సర్పంచుల అవగాహన కార్యక్రమంలో భాగంగా సదస్సుకు హాజరైన  రేణుకను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు.  గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విలేజ్ క్యాబినెట్ పనితీరుపై సమాచారం తెలుసుకున్నారు.   అడిషనల్ కలెక్టర్ రవి, డీఆర్డీఏ  పీడీ శ్రీనివాస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులకు ముప్పారం డైరీ ని అందజేశారు.