ఐడీ కార్డు చూపించినా.. ఇష్టమొచ్చినట్టు కొట్టిన్రు

ఐడీ కార్డు చూపించినా.. ఇష్టమొచ్చినట్టు కొట్టిన్రు

పోలీసులపై సింగరేణి కార్మికుల ఫైర్
కేటీకే1వ గనిలో ఆందోళన

భూపాలపల్లి రూరల్: విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న కార్మికుడిపై పోలీసులు అకారణంగా దాడిచేసి కొట్టారని ఆరోపిస్తూ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే1వ గనికార్మికులు సోమవారం ఉదయం షిఫ్టులో ఆందోళనకు దిగారు. ఆదివారం సెకండ్ షిఫ్టులో హాలర్ ఆపరేటర్ గా విధులు నిర్వహించిన ముక్కెర రవి ఇంటికి వెళ్తూ బైకులో పెట్రోలు లేక రోడ్డుపై నిలబడ్డాడని తెలిపారు. అంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు రవిపై లాఠీలతో విపరీతంగా కొట్టారని తెలిపారు. ఐడీ కార్డు చూపించినా వినలేదని పేర్కొన్నారు. పోలీసులపై చర్యలు తీసుకునేంతవరకు విధులు నిర్వర్తించబోమని తెలిపారు. అనంతరం గని అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించి విధులకు హాజరయ్యారు.

For More News..

రాష్ట్రంలో పండిన ప్రతీ గింజా కొంటం

‘వర్క్ ఫ్రం హోం’ పై మైక్రోసాఫ్ట్ సూచనలు

ఒలంపిక్స్ కొత్త తేదీలు ఖరారు

రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి