గిరిజన మహిళపై పోలీసుల దాడి సిగ్గుచేటు : రఘునందన్ రావు

గిరిజన మహిళపై పోలీసుల దాడి సిగ్గుచేటు : రఘునందన్ రావు

ఎల్​బీనగర్, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవం రోజున గిరిజన మహిళపై పోలీసుల దాడి ఘటన.. రాష్ట్ర సర్కారుకు సిగ్గుచేటని ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, సీతక్క మండిపడ్డారు. కర్మన్ ఘాట్​లోని జీవన్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న బాధితురాలు వడ్త్యా లక్ష్మీని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంబర్ వన్ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనే విషయం ఈ ఘటనతో తెలుస్తోందన్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ నేతలతో కలిసి బాధితురాలిని పరామర్శించారు.  షీ టీం ఏర్పాటు చేసి మహిళలను రక్షిస్తున్నామని చెప్పుకుంటున్న పోలీసు వ్యవస్థ, మంత్రులు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.