
సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ లో బీజేవైఎం బేక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మోడీ ప్రధాని అయి ఎనిమిదేళ్లు అవుతున్న సందర్భంగా బీజేవైఎం వికాస్ తీర్థ బైక్ ర్యాలీ చేపట్టింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించిన ఈ ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కిషన్ రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంతకుముందు బన్సీలాల్పేట్లో బహిర్గతమైన మెట్ల బావిని ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ఎనిమిదేళ్లుగా దేశాన్ని ప్రధాని మోడీ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. రైతాంగానికి, అణగారిన వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశ దిశను మార్చారని కిషన్ రెడ్డి అన్నారు.