
చండూరు (మర్రిగూడ), వెలుగు: కిష్టరాయన్ పల్లి, చర్లగూడెం భూనిర్వాసితులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారు జామున 2:30 గంటలకు 300 మంది పోలీసులు మర్రిగూడ మండల కేంద్రానికి చేరుకున్నారు. దీక్ష చేస్తున్న వారితో పాటు వారికి మద్దతుగా కొన్ని రోజులు ఆందోళ నలు చేస్తున్న నిర్వాసితులు 100 మందిని అదుపులోకి తీసుకుని దేవరకొండ ఠాణాకు తరలించారు.
మునుగోడులో సీఎం సభ ముగియ గానే విడిచిపెట్టారు. న్యాయమైన పరిహారం చెల్లించాలని డిండి ప్రాజెక్టు నిర్వాసితులు 5రోజులుగా మర్రిగూడ మండల కేంద్రంలో దీక్ష చేస్తున్నారు. సీఎం సభను అడ్డుకుం టామని హెచ్చరించడంతో ముం దస్తు అరెస్టు చేశారు. అరెస్టును నిర సిస్తూ మర్రిగూడ బస్టాండ్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.