
హైదరాబాద్ : లాక్ డౌన్ లో అనవసరంగా బయటికి వస్తున్న వారు నానా రకాలుగా డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు పోలీసులు. వాహనాలపై పోలీసు, ప్రెస్-మీడియా,ఎమ్మెల్యేలమంటూ కొంతమంది నకిలీ కేటుగాళ్లు రోడ్లపైకి లాక్ డౌన్ తర్వాత రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఆదివారం నార్సింగ్ లో ఓ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి తిరుగుతున్న వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు నార్సింగ్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్. కారు, స్టిక్కర్ పై ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవడంతో ఫేక్ అని గుర్తించామన్నారు. దీంతో ఆ వాహనదారుడిని హెచ్చరించి, స్టిక్కర్ తొలగించాలని సూచించి వెయ్యి రూపాయిలు ఫైన్ విధించామన్నారు. ఇటువంటి చిల్లర పనులు చేస్తూ పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు పోలీసులు.